రాయచోటి: స్కేటింగ్‌లో ప్రతిభ చూపిన అఫ్రిన్‌కు మంత్రి అభినందనలు

52చూసినవారు
రాయచోటి: స్కేటింగ్‌లో ప్రతిభ చూపిన అఫ్రిన్‌కు మంత్రి అభినందనలు
అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన కొడూరు ప్రాంతానికి చెందిన ఎస్. అఫ్రిన్ విశ్వవిద్యాలయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో మూడో స్థానాన్ని సాధించింది. ప్రస్తుతం ఆమె సాయి డిగ్రీ కాలేజీలో చదువుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదివారం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. అఫ్రిన్ విజయం యువతకు ప్రోత్సాహకరంగా మారుతుందని మంత్రి అన్నారు.

సంబంధిత పోస్ట్