రాయచోటి: బండలాగుడు పోటీలను ప్రారంభించిన మంత్రి

67చూసినవారు
రాయచోటి: బండలాగుడు పోటీలను ప్రారంభించిన మంత్రి
శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి 31 వ వార్షిక తిరుణాల మహోత్సవం సందర్భంగా శనివారం రాయచోటి పట్టణం, బొట్లచెరువు గ్రామంలో ఏర్పాటుచేసిన ఎడ్ల బండలాగుడు పోటీలను రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఆంజనేయ స్వామిగుడిలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండపంలో ముఖ్య అతిథులకు అర్చక స్వాములు వేదాశ్వీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్