రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం రాయచోటిలోని తానా సర్కిల్ నందు ఏర్పాటు చేసిన సోలార్ ఏజెన్సీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి మాట్లాడుతూ రాయచోటి పట్టణంలో సోలార్ ఏజెన్సీస్ ఏర్పాటు చేయడం సంతోషకరం అన్నారు. ప్రజలు తమ ఇంటిపై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని సోలార్ విద్యుత్తును వినియోగించాలన్నారు. సోలార్ విద్యుత్ వాడటం వల్ల డబ్బు ఆదా అవుతుందన్నారు.