రాయచోటి: చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి

71చూసినవారు
రాయచోటి: చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి శనివారం రాయచోటి మండలం రామాపురంలో శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం నందు నిర్వహించిన జ్యోతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి భక్తిశ్రద్ధలతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్