రాయచోటిలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం 6వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామి వారి చెంతకు తీసుకెళ్లారు. అనంతరం ఆలయ విశిష్టత గురించి అర్చకులు మంత్రికి వివరించారు. తీర్థప్రసాదాలు అందజేశారు.