రాయచోటి: పలు సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించిన మంత్రి

74చూసినవారు
రాయచోటి: పలు సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించిన మంత్రి
రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి బుధవారం రాయచోటి పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్ నందు పలు సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల సమస్యలను ఓపికగా విని సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లాలోని ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మంత్రి ముందుకు వెళుతూ ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తున్నారని ఆయన అనుచరులు వివరించారు.

సంబంధిత పోస్ట్