రవాణా శాఖకు కీర్తి తెచ్చేలా విధులు నిర్వహించాలని ఉద్యోగులకు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి హితవు పలికారు. సీనియర్ అధికారై ఉండి అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతూ మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు సరికాదని మంత్రి అన్నారు. అధికారి దుష్ప్రవర్తన దురదృష్టకరమని ఆయన ఖండించారు. అధికారిని విధులు నుండి తొలగించి కేంద్రానికి సరెండర్ చేశామని, సమగ్ర విచారణ చేపట్టి అధికారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.