రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి శనివారం రాయచోటి పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్ నందు రాష్ట్ర కౌన్సిల్ మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 5వ తేదీ విజయవాడలో న జరిగే రాష్ట్ర కౌన్సిల్ మహాసభలకు ఉద్యోగులందరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.