రాయచోటిలో ఉగ్రవాద సంబంధాల దర్యాప్తు వేగం పెరిగింది. అరెస్టయిన అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీ ఇళ్లలో పోలీసులు శనివారం మరోసారి సోదాలు నిర్వహించగా అబూబకర్ ఇంట్లో ఓ పార్శిల్ బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఢిల్లీకి పంపించేందుకు సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. రాయచోటి కేంద్రంగా ఉగ్ర ముఠాలు కార్యకలాపాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు అనుమానాల నేపథ్యంలో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతుంది.