వికలాంగుల పింఛన్లు, అనారోగ్య పింఛన్లు ధ్రువీకరణ ప్రక్రియ పక్కాగా జరగాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. శనివారం రాయచోటి కలెక్టరేట్ లో డిఆర్‌డిఏ, వైద్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వికలాంగుల, అనారోగ్య పింఛన్లు ధ్రువీకరణ కొరకు 12 మందితో కూడిన డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.