ప్రజలు ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన పెంచుకోవాలని డీఎఫ్ఓ అనిల్ కుమార్ తెలిపారు. బుధవారం రాయచోటిలో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అగ్నిమాపక శాఖ వారు ప్రయోగాత్మకంగా ప్రజలకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలుప్రమాదాల నుండి ప్రజలు ఎలా బయట పడాలోబయటపడాలో అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో రాయచోటి ఫైర్ ఆఫీసర్ వెంకటరామిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.