రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం రాయచోటి పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను మంత్రికి వివరించారు. ఈ సమస్యలను ఓపికగా విన్న మంత్రి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి అక్కడికక్కడే బాధితుల సమస్యలు పరిష్కరించారు.