రాయచోటి పట్టణంలోని వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం మహిళలు అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను నివారించేలా కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించండంటూ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందన్నారు.