రాయచోటి: చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి

52చూసినవారు
రాయచోటి: చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి
రాయచోటి పట్టణాన్ని చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్ది పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీ సమీపంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంత్రి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరితో కలిసి మొక్కలు నాటారు. మంత్రి మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి ఒక్కరూ మన ఇంటితో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్