రాయచోటి మాజీ ఎంపిపి రాజారెడ్డి మృతికి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి నివాళులర్పించారు. ఆదివారం ఉదయం రాయచోటి పట్టణంలోని ఎస్ ఎన్ కాలనీ నందున్న నివాసంలో రాజారెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించారు. అతని మృతిపట్ల సంతాపం తెలిపి వారి కుటుంబ సభ్యులను శ్రీకాంత్ రెడ్డి పరామర్శించారు. డీసీసీబీ మాజీ డైరెక్టర్ సేఠ్ వెంకట్రామిరెడ్డి తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.