మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల జిల్లా పరిధిలో చోటు చేసుకున్న ముఖ్య నేర సంఘటనలు, చీటింగ్ కేసులు, సైబర్ నేరాలు, దొంగతనాలు తదితర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.