విద్యార్థిని, విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు, నైపుణ్యాలని, విజ్ఞానాన్ని ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న కలామ్స్ విజన్ 2024 సైంటిఫికల్ ప్రాజెక్ట్ ఎక్స్ పో కార్యక్రమాన్ని జిల్లాలో వుండే హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యా శాఖ అధికారి సుబ్రమణ్యం కోరారు. సోమవారం రాయచోటిలో ఆర్గనైజర్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు.