రాయచోటి: తల్లికి వందనం పథక విజయోత్సవం: మంత్రి

75చూసినవారు
రాయచోటి: తల్లికి వందనం పథక విజయోత్సవం: మంత్రి
అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి క్యాంపు కార్యాలయంలో "తల్లికి వందనం" పథకం విజయాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లబ్ధిదారులతో కలిసి జరుపుకున్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, భారీ కేక్ కట్ చేశారు. పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో నిధులు జమ కావడం పేద విద్యార్థులకు వెలుగు నింపిందని మంత్రి అన్నారు. తల్లికి గౌరవం సమాజానికి పునాది అని తెలిపారు.

సంబంధిత పోస్ట్