రాయచోటి: దోబీఘాట్ మోటర్ మరమ్మత్తులకు చర్యలు తీసుకోండి

73చూసినవారు
రాయచోటి: దోబీఘాట్ మోటర్ మరమ్మత్తులకు చర్యలు తీసుకోండి
రాయచోటి లోని గున్నికుంట్ల రోడ్డు వద్ద ఉన్న దోబీఘాట్ బోరులో అమర్చి ఉన్న మోటారు మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్ కు గురువారం రజక సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు వినతి పత్రం సమర్పించారు. గత కొన్ని రోజులుగా బోరు మోటారు పనిచేయక అక్కడ బట్టలు ఉతికి జీవనం సాగిస్తున్న రజకులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వెంటనే బోరు మోటారు కు మరమ్మతులు చేసి సమస్య పరిష్కరించాలని రమేష్ బాబు కోరారు.

సంబంధిత పోస్ట్