జిల్లాలో మాదక ద్రవ్యాల సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం రాయచోటిలో మాదక ద్రవ్యాల నివారణకు వ్యూహాలు, ప్రణాళికలు, అమలు గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల అక్రమ రవాణా వినియోగాన్ని అరికట్టడానికి ఏర్పాటు చేసిన ఎలైట్ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.