రాయచోటి: అభియాన్ ను పక్కాగా అమలు చెయ్యాలి

73చూసినవారు
రాయచోటి: అభియాన్ ను పక్కాగా అమలు చెయ్యాలి
దార్తి ఆబా జన్ జాటియ గ్రామ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమాన్ని గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పక్కాగా అమలు అవ్వాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దార్తి ఆబా జన్ జాటియ గ్రామ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమంపై అధికారులతో జిల్లా సంయుక్త కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్