రాజకీయంగా మా కుటుంబాన్ని దెబ్బతీసిన నేతలను రాజకీయంగానే అంతం చేయడం మా లక్ష్యమని దివంగత మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు చిన్న కుమారుడు టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు సుగవాసి ప్రసాద్ బాబు శపథం చేశారు. శుక్రవారం సాయంత్రం చిన్నమండెం మండల కేంద్రంలో సుగవాసి పాలకొండ్రాయుడు సంస్మరణ సభ సాక్షిగా ప్రసాద్ బాబు రాజకీయ శంఖారావం పూరించారు.