వైసిపి నాయకులు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. రామాపురం మండలం రాచపల్లి పంచాయతీలో అక్రమ నిర్మాణాలను అధికారులు చట్టబద్ధంగా తొలగించడం జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ నిర్మాణాల తొలగింపు అన్యాయం అంటూ అడ్డుకోవడం బాధాకరమని ఆయన అన్నారు.