రాయచోటిలో టీడీపీ నేతలు బరితెగించారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ శనివారం ఆరోపించారు. రెడ్డి నేషనల్ హైవే పనుల కోసం స్టోర్ చేసి పెట్టుకున్న మెటీరియల్‌ను రాత్రిపూట దొంగతనం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరూ లేని సమయం చూసి స్థానిక మంత్రి అండతో టిప్పర్లలో మెటీరియల్‌ను తరలిస్తున్నారని, సమాచారం అందుకుని అక్కడికి రాగానే ఉడాయించినట్లు రమేష్ కుమార్ రెడ్డి వివరించారు.