జిల్లాలో చేపడుతున్న పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటిలో కలెక్టరేట్ నందు పర్యాటక సమితి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యమైన పర్యాటక కేంద్రాలకు రహదారులు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు.