రాయచోటి పట్టణంలోని భద్రకాళీ సమేత వీరభద్రాలయంలో సోమవారం స్వామి, అమ్మవార్ల పల్లకీ ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వివిధ రకాల పుష్పాలు, పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం మూలవిగ్రహాలను ఆలయం చుట్టూ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.