రాయచోటి: వైసీపీ శవరాజకీయాల దుర్మార్గాన్ని ఖండిస్తున్నాం

74చూసినవారు
రాయచోటి పట్టణ శివార్లలోని మిట్ట వాండ్లపల్లిలో ఇటీవల ఒక మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని గురువారం కౌన్సిలర్ మదన మోహన్ రెడ్డి తెలిపారు. రాయచోటి పట్టణంలోని మండిపల్లి భవన్‌లో ఆయన మాట్లాడుతూ కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణాలతో ఆ బాలిక ఈ దారుణ నిర్ణయం తీసుకుందన్నారు. దానిని తెలుగుదేశం పార్టీ పై బురద చల్లే ప్రయత్నాలు చేయడం వైసీపీ శ్రేణుల శవ రాజకీయాలకు నిదర్శనమని వారు విమర్శించారు.

సంబంధిత పోస్ట్