అర్హులైన పేదలకు వారి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గురువారం బోరెడ్డిగారిపల్లిలో ప్రజా దర్బార్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి అహర్నిశలు కృషి చేస్తున్నదని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేసి వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.