అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించి పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకు విశేష కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాయచోటి పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్ నందు మంత్రి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో అర్హులకు నూతన పెన్షన్లు, ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.