అన్నమయ్య జిల్లా రాయచోటిలో టెన్త్ బాలిక ఉన్మాది వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై వైసీపీ ఎక్స్ లో స్పందించింది. బాలికను వేధించింది టీడీపీ నేత తారకరత్నేనని అతడు మంత్రి రాంప్రసాద్ అనుచరుడు సంజీవుడి వర్గానికి చెందినవాడని ఆరోపించింది. టీడీపీ నేతలతో అతను దిగిన ఫొటోలను ఎక్స్ లో షేర్ చేస్తూ అధికారం ఉందని మీ కార్యకర్తలకు ఇలా చేయమని పర్మిషన్ ఇచ్చారా సీబీఎన్?" అంటూ ప్రశ్నించింది.