అన్నమయ్య జిల్లా రాయచోటికి నేడు (మంగళవారం) సాయంత్రం వైఎస్ షర్మిల పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ పార్టీ డీసీసీ అధ్యక్షుడు గాజుల ఖాదర్ బాషా తెలిపారు. ఆ తర్వాత పీసీఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగే జిల్లా కార్యవర్గ సమావేశంలో షర్మిల పాల్గొంటారన్నారు. అన్నమయ్య జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.