మంచాలమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సంబేపల్లె మండలం నారాయణరెడ్డిగారిపల్లె గ్రామంలో జరిగిన మంచాలమ్మ జాతర సందర్భంగా సుద్దల వాండ్లపల్లెలో ఆదివారం వైఎస్ఆర్ సిపి నాయకులు రాజా, దివాకర్ లు ఇచ్చిన విందులలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు, వైఎస్ఆర్ సిపి కార్యకర్తలతో శ్రీకాంత్ రెడ్డి మమేకమయ్యారు.