సంబేపల్లి: శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శం

60చూసినవారు
సంబేపల్లి: శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శం
రాముని జీవితం అందరికీ ఆదర్శమని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. సంబేపల్లి మండలం ప్రకాష్ నగర్ కాలనిలో నూతనంగా నిర్మించిన రామాలయంలో శుక్రవారం విగ్రహ ప్రతిష్ఠాపన, ధ్వజారోహణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆలయ కమిటీ నిర్వాహకులు మేళా తాళాలతో ఘన స్వాగతం పలుకగా, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్