రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై వేరుశనగ విత్తన కాయల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 9:00 గంటలకు సంబేపల్లి మండలం, నారాయణరెడ్డిగారి పల్లెలోని రైతు సేవాకేంద్రం నందు విత్తన పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.