రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం సంబేపల్లి మండలం, శెట్టిపల్లె పెద్దబిడికి గ్రామంలో జరిగే దండు మారెమ్మ సేవాలాల్ మహారాజ్ జాతరలో పాల్గొని మారెమ్మ తల్లికి పూజల నిర్వహించారు. ఈ సందర్భంగా సంబేపల్లి మండల ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై మంత్రివర్యులకు ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికి శాలువా, గజమాలతో ఘనంగా సన్మానించారు.