మట్టి ఇసుక అనుమతులు లేకుండా తరలిస్తే కఠిన చర్యలు

73చూసినవారు
మట్టి ఇసుక అనుమతులు లేకుండా తరలిస్తే కఠిన చర్యలు
ఇసుక మట్టి అనుమతులు లేకుండా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సుండుపల్లె తహసిల్దార్ జరీనా బేగం బుధవారం తెలిపారు. మట్టి ఆక్రమంగా తరలిస్తున్నట్లు బుధవారం ప్రజల నుండి ఫిర్యాదులు అందాయి. ఇసుక మట్టి తరలించేందుకు ఎవ్వరికి అనుమతులు ఇవ్వలేదు. ఎవరైనా తరలించినట్లు తెలిస్తే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, నిబంధనలను అనుసరించి అనుమతులు తీసుకొని తోలుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్