జిల్లాలో ఉచిత ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలి

69చూసినవారు
జిల్లాలో ఉచిత ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలి
జిల్లాలో ఉచిత ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాయచోటి కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎన్ని ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయి, ఎంత ఇసుక లభ్యత ఉంది. నూతన ఇసుక విధానం ఏమిటి, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏమేం చర్యలు తీసుకున్నారని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్