రాయిచోటిలో శనివారం రాత్రి కాల్పులకు కారణాలు ఇవే

59చూసినవారు
రాయిచోటిలో శనివారం రాత్రి కాల్పులకు కారణాలు ఇవే
రాయచోటిలో శనివారం అర్ధరాత్రి నాటు తుపాకులతో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు అడవి పందుల వేటకు వెళ్ళగా పందులు అనుకుని వేరే గ్రామానికి చెందిన కొందరు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఈ కాల్పులలో హనుమంతు (50) చికిత్స పొందుతూ మృతి చెందగా రమణకు తీవ్ర గాయాలు అయ్యాయి. నామాల కుంటకు చెందిన వీరు కాటిమాయ కుంట వద్ద గుడిసెలు వేసుకుని ఉంటూ వెంట్రుకల వ్యాపారం చేస్తుంటారు.

సంబంధిత పోస్ట్