సంబేపల్లి మండలం బావులకాడపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో,ఇన్నోవా,ఆటోలు ఒకదానికొకటి ఢీకొనడంతో డ్రైవర్ జాఫర్ (48) మృతిచెందాడు. కర్ణాటక రాష్ట్రం రాయచోటికి చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.వాహనాలను తప్పించే ప్రయత్నంలో ఆటో నుజ్జునుజ్జు అయింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.