బి. కొత్తకోట మండలం కాండ్లమడుగు క్రాస్ వద్ద శనివారం టిప్పర్ ఢీకొని ఫార్మసీ విద్యార్థి తీవ్రంగా గాయపడినట్లు బి. కొత్తకోట సీఐ జీవన్ గంగానాథ్ బాబు తెలిపారు. బండమీద పల్లెకు చెందిన కార్తీక్ రెడ్డి (20) మదనపల్లిలో ఫార్మసీ చదువుతున్నాడు. కళాశాలకు బైక్ పై బయలుదేరగా కాండ్లమడుగు క్రాస్ వద్ద టిప్పర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనంలో మదనపల్లి ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.