ములకలచెరువు జడ్పిటిసి పై కేసు నమోదు
ములకలచెరువు జడ్పిటిసి మోహన్ రెడ్డి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరసింహుడు తెలిపారు. గురువారం కోరం లేక ఎంపీడీవో హరి నారాయణ మండల సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ కారణంగా జడ్పీటీసి ఎంపీడీవో ను దూషించారని, జడ్పిటిసి మరికొందరు ఎంపీటీసీ లపై ఎంపీడీవో ములకలచెరువు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జడ్పిటిసి, ఎంపీటీసీ లను విచారించి శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరసింహుడు తెలిపారు.