తంబళ్లపల్లి నియోజకవర్గంలోని కురబలకోట మండలం అంగళ్లులో మంగళవారం లారీ - ఆర్టీసీ బస్సు ఢీకొనడం వల్ల ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 40 మంది గాయపడ్డారు, వీరిని జిల్లా ఆస్పత్రికి 108, ఆటోల్లో తరలించారు. గాయపడ్డ క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలు విని తీవ్ర విషాదం నెలకొంది. గాయపడిన 40 మందిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.