ములకలచెరువు మండలం జాతీయ రహదారిపై రోడ్లు విస్తరణ పనుల్లో భాగంగా కొత్త లైన్లు ఏర్పాటుతోపాటు మెయింటినెన్స్ పనులుకారంగా బురకాయలకోట 132 కెవి సబ్ స్టేషన్ పరిధిలో శనివారం సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఏఈ రామ లక్ష్మణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 8: 30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ములకలచెరువు, పీటీఎం, బి. కొత్తకోట మండలాల్లోని గ్రామాల విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నమన్నారు. ఇందుకు విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఏఈ రామలక్ష్మణ్ కోరారు.