పెద్దమండ్యం: చెరువులో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

81చూసినవారు
పెద్దమండ్యం: చెరువులో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
చెరువులో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందిన సంఘటన పెద్ద మండెం మండలంలో ఆదివారం జరిగింది. ఎస్సై రమణ కథనం మేరకు పెద్దమండెం కంచర్ల లోకంచర్లలో ఉన్న రాజశేఖర్ ఇంటికి జాతరకు శనివారం రాత్రి బి. కొత్తకోట మండలం బండమీద పల్లెకు చెందిన భాస్కర్ రెడ్డి (17) వచ్చారు. స్నేహితులతో కలిసి ఆదివారం పాపిరెడ్డి చెరువుకు ఈతకు వెళ్లారు. భాస్కర్ రెడ్డి నీట మునిగి మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్