పిటీఎం: ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష తేదీ మార్పు

69చూసినవారు
పిటీఎం: ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష తేదీ మార్పు
పీటీఎం ఆదర్శ పాఠశాలలో 2025 - 26 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష తేదీని మార్పు చేసినట్లు పెద్ద తిప్ప సముద్రం ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శివకుమారి తెలిపారు. ఈనెల 20వ తేదీ ఆదివారం ఈస్టర్ పండుగ కారణంగా ప్రవేశ పరీక్ష తేదీని 21వ తేదీకి మార్చినట్లు ఆమె తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్