తంబళ్లపల్లె మండలం మేకావారిపల్లికి చెందిన జరిపిటి మల్లికార్జున(41)కు జీవిత ఖైదు, రూ.1.60 లక్షల జరిమానా విధిస్తూ కడప కోర్టు జడ్జి జీఎస్. రమేష్ కుమార్ శిక్ష విధించారు. అనుమానంతో భార్య గంగాదేవి(25)ను 2019 మార్చి 3న గొంతునులిమి హత్య చేశాడు. విచారణలో నేరం రుజువుకావడంతో ఈ తీర్పు వెలువడింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులను ఎస్పీ ప్రశంసించారు.