అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలంలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. గాలి తాకిడికి తంబళ్లపల్లి, కోసువారిపల్లి, కొటాల పలు గ్రామాలలో మామిడి తోటలలో గాలి వానకు మామిడికాయలు నేలరాలాయని రైతులు తెలిపారు. మామిడి రైతులు ఆశ నిరాశ అయిందని నిట్టూరుస్తున్నారు. మామిడికాయలు చేతికి వచ్చేటప్పటికి ఇలా నష్టం వాటిల్లిందని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.