తంబళ్లపల్లి మండలం గంగిరెడ్డిపల్లి లో వెలసిన పురాతన మద్దెమ్మ ఆలయంలో ఆలయ స్థాపకులు రవికుమార్, ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఆదివారం వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో గత రెండు రోజులుగా అర్చకులు అమర్నాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పెద్ద తన దాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చివరి సంవత్సరం మాజీ సర్పంచ్ పుట్ట లక్ష్మీ శేఖర్ గుప్తా, భక్తులు పాల్గొన్నారు