తంబళ్లపల్లి మండలంలోని ఎస్సీ కులాల కు చెందిన లబ్ధిదారులు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని తంబళ్లపల్లె ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎస్సీ రుణాలకు ఈనెల 14వ తేదీ నుండి మే 15 తేదీ వరకు అర్హులైన అధికారులు ఏపీఓబీ ఎంఎంఎస్ వెబ్ సైట్ లో ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మండలంలోని ఎస్సీ లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగ చేసుకోవాలని ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి కోరారు.