ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత

63చూసినవారు
ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత
ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో హైవే విస్తరణ పనుల్లో భాగంగా ఇళ్లను కోల్పోతున్న ప్రజలకు న్యాయం చేయాలంటూ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజుకు ఆదివారం గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ జాతీయ రహదారి 165 ఆనుకుని 70ఏళ్ల నుంచి నివసిస్తున్నామని, పంచాయితీ పన్ను, కొళాయి బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. బాధితులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్